రేణిగుంట జులై 16. రేణిగుంట మండలం, మామండూరు గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న గంగమ్మ (గ్రామదేవత) జాతర మహోత్సవంలో తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి గురువారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.జాతర సందర్భంగా ఆలయానికి విచ్చేసిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కి గ్రామస్తులు,ఆలయ కమిటీ సభ్యులు,ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారుఈ కార్యక్రమంలో కూటమి పార్టీ మండల నాయకులు, ఆలయ కమిటీ నిర్వాహకులు,కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed