కనిగిరి జూలై 8 మన ధ్యాస న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని పోతవరంలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ బుధవారం ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దారపనేని అధికారులతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించి, తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని కోరారు. బి ఎల్ ఓ లు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఓటర్ల వివరాల నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ లను దారపనేని పరిశీలించారు. 2002 ఓటర్ లిస్టులో అమ్మా, నాన్న పేరు సీరియల్ నెంబర్ మ్యాపింగ్ చేసి ఓట్లను క్రమబద్ధీకరించాలని అధికారులను కోరారు. 2002 సర్ ఓటర్ లిస్టులో పేరు ఉండి అదేవిధంగా 2025 ఓటర్ లిస్టులో పేరు ఉన్నవారు కూడా సెల్ఫ్ మ్యాపింగ్ చేయించుకుంటే మంచిదని దారపనేని అన్నారు. అలాంటివారు బిఎల్ఓ ల వద్దకు వెళ్లి సెల్ఫ్ మ్యాపింగ్ అని చెప్పాలన్నారు. సర్ లో సేకరించిన సమాచారాన్ని వెంటనే డిజిటలైజ్ చేసి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఓటర్ల జాబితా రూపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు కోడిగుడ్లపాడు గ్రామ టిడిపి నాయకులు దారపనేని రాజేంద్రప్రసాద్, పోతవరం టిడిపి నాయకులు చెనికల చినమాల కొండయ్య (బొజ్జయ్య), మాధవరావు, మానం మల్లికార్జున రావు, వీఆర్వో చెన్నకేశవులు, బి ఎల్ ఓ రాధా, వీఆర్ఏ మస్తాన్ పాల్గొన్నారు.