ఏర్పేడు జూన్ 11.

స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పేడు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గ పరిశీలకులు నాగేశ్వర్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

​రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని, తిరుపతిలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు సంబంధించిన గోడ పత్రికను (పోస్టర్) ఈ సందర్భంగా నాయకులు ఆవిష్కరించారు.

​ఈ సందర్భంగా పరిశీలకులు నాగేశ్వర్ నాయుడు, మండల అధ్యక్షుడు నాగరాజ నాయుడు మాట్లాడుతూ… తిరుపతిలో జరిగే ఈ ప్రతిష్టాత్మక బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏర్పేడు మండలం నుండి ప్రజలను, కూటమి శ్రేణులను భారీ ఎత్తున తరలించి సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సభ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పేరం ధనంజయులు నాయుడు, రంగినేని చెంచయ్య నాయుడు, శివశంకరరెడ్డి, సూరి నాయుడు, పున్నారావు, గాలి కృష్ణవేణి, మోహన్ నాయుడు, గిరి నాయుడులతో పాటు క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జీలు, పార్టీ ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *