రేణిగుంట జూన్ 11.
ఒంగోలులో మే 31, 2026న నిర్వహించిన 14వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెంచాక్ సిలాట్ ఛాంపియన్‌షిప్ – 2026 పోటీలలో రెయిన్‌బో స్కూల్ విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు..జూనియర్ బాలికల విభాగం.పెరుమాళ్ళు సాయి సింధు (36–39 కేజీలు) – స్వర్ణ పతకం, జాతీయ స్థాయికి అర్హత సాధించారు. షేక్ షబ్నం (57–60 కేజీలు) – స్వర్ణ పతకం, జాతీయ స్థాయికి అర్హత సాధించారు.ప్రీ-జూనియర్ బాలుర విభాగం.మహమ్మద్ ఖాలిద్ (44–48 కేజీలు) – రజత పతకంప్రీ-టీన్ బాలుర విభాగం.చిప్పల జ్ఞానేశ్వర్ (26 కేజీలు) – కాంస్య పతకం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి షెహర్ భాను మరియు కరస్పాండెంట్ పి ఎ ఖాన్ , ఉపాధ్యాయులు, కోచ్‌ మాస్టర్ లోకేష్ మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన ఈ విద్యార్థులు జాతీయ స్థాయిలో కూడా రాణించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు మరియు వారి భవిష్యత్ క్రీడా ప్రస్థానానికి శుభాకాంక్షలు తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *