మన ధ్యాస, నెల్లూరు,జనవరి 5: నెల్లూరు నగరం,దర్గామిట్ట, మినర్వా గ్రాండ్ ప్రక్కన సాయి రేఖ మెడికల్ స్టోర్స్ సోమవారం ఉదయం ప్రారంభించినారు.ఈ సందర్భంగా సాయి రేఖ మెడికల్స్ స్టోర్స్ అధినేతలు మాట్లాడుతూ….. ఈరోజు ప్రారంభించిన సాయి రేఖ మెడికల్ స్టోర్స్ ఇది 12వ బ్రాంచ్ ప్రారంభం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. మా బ్రాంచ్ లు నెల్లూరు చిత్తూరు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి అని తెలిపారు. మా షాపులో అన్ని మందులపై డిస్కౌంట్ కలదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టూ టౌన్ ఎస్ఐ శివ, షాప్ అధినేతలు పాండురంగారావు, భరత్ కుమార్,హరీష్ కుమార్, సాయి చైతన్య, బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *