

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 11: బద్వేల్ పట్టణం లో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని శుక్రవారం మైదుకూరు రోడ్ లోని మంచినీటి చలివేంద్రం వద్ద 2,వ సారి SKB బ్రాయిలర్ చికెన్ సెంటర్ మౌలాలి సహకారంతో మజ్జిగ వితరణ కార్యక్రమం,ఆర్టీసీ డిఎం నిరంజన్, ఆర్యవైశ్య వర్తక సంగం అధ్యక్షులు కె,వి సుబ్బారావు, కరీముల్లా (బీమా) జర్నిలిస్ట్ నరసింహ చేతులు మీదుగా పలువురికి మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని అందజేయడం జరిగింది, ఆర్టీసీ డిఎం నిరంజన్ మాట్లాడుతూ, వేసవికాలంలో ప్రజల దాహాన్ని తీర్చడం ఒక గొప్ప వరంగా మనం భావించాలని ప్రతి ఒక్కరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని ఈ సేవా కార్యక్రమానికి సహకరించినటువంటి వారిని అభినందించారు. ఒక నెలరోజులపాటు చలివేంద్రాలా వద్ద మంచినీరు, రెండవసారి మజ్జిగ వితరణకు సహకరించిన మౌలాలి గారికి పరువులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.