
తిరుపతి, అక్టోబర్, 26 : తిరుమల, తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం జిల్లాకు విచ్చేసిన భారత ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ కు రేణిగుంట విమానాశ్రయం వద్ద జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఘన స్వాగతం పలికారు. జిల్లా ఇంచార్జి మినిస్టర్ అనగాని సత్య ప్రసాద్, డి ఐ జి షిమోషి, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సిమ్స్ డైరెక్టర్ జగదీష్, తదితరులు భారత ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం భారత ఉప రాష్ట్రపతి తిరుమల బయల్దేరి వెళ్లారు.