రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలై, ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా, రామచంద్రాపురం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి సందర్శించి, పరిశీలించారు.నామినేషన్ల దాఖలు ప్రక్రియపై స్థానిక నేతలతో చర్చించి, అభ్యర్థులకు మరియు వారి ప్రతినిధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.నామినేషన్ పత్రాలలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా, అవసరమైన ధృవీకరణ పత్రాలన్నింటినీ స్థానిక నాయకుల సహకారంతో ముందుగానే సరిచూసుకుని సకాలంలో దాఖలు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

