తుడా ఆధ్వర్యంలో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారంగా సరికొత్త మాస్టర్ ప్లాన్ రోడ్డు

శ్రీకాళహస్తి, నాయుడుపేట వైపు వెళ్లే ప్రయాణికులకు నేరుగా బైపాస్ అనుసంధానం

క్షేత్రస్థాయిలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్,తుడా ఛైర్మన్, వైస్ చైర్మన్, జేఈవో, ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు

తిరుపతి నగరం శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల కల్పనకు సరికొత్త రూపురేఖలు మారుతున్నాయి.

ఇందులో భాగంగా రేణిగుంట ప్రధాన రహదారి నుంచి దామినేడు మీదుగా నాయుడుపేట జాతీయ రహదారిని అనుసంధానించే నూతన మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణ పనులకు దామినేడు వద్ద శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ,తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి , చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని , తుడా వైస్ ఛైర్మన్ ఆర్. గోవింద రావు , తితిదే జేఈఓ శరత్ , బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి , భానుప్రకాశ్ రెడ్డి , వన్నెకుల క్షత్రియ ఛైర్మన్ సి ఆర్ రాజన్ , యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ప్రస్తుతం రేణిగుంట, తిరుపతి మార్గంలో నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు ఈ నూతన రహదారి అత్యంత కీలకం కానుంది.

చెన్నై, నాయుడుపేట, శ్రీకాళహస్తి వైపు వెళ్లే భారీ వాహనాలు, సుదూర ప్రాంత ప్రయాణికులు నగర అంతర్గత రహదారుల్లోకి రాకుండా ఈ లింక్ రోడ్డు ద్వారా నేరుగా హైవేను చేరుకోవచ్చని నేతలు తెలిపారు.

దామినేడు మరియు పరిసర ప్రాంతాలు ఈ రోడ్డు నిర్మాణంతో వేగంగా అభివృద్ధి చెందనున్నాయి. నివాస, వాణిజ్య సముదాయాల విస్తరణకు అనువైన వాతావరణం ఏర్పడటంతో పాటు స్థానికులకు మెరుగైన రవాణా సదుపాయం లభిస్తుందన్నారు.

ఈ భూమి పూజ కార్యక్రమంలో తుడా అధికారులు, ఇంజనీరింగ్ విభాగం ప్రతినిధులు, కూటమి ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *