ఏర్పేడు,అక్టోబర్,7:​ఏర్పేడు మండలంలోని కొబాక మరియు మన్నసముద్రం గ్రామాల్లో జరుగుతున్న రీసర్వే గ్రౌండ్ ట్రూథింగ్ పనులను మాన్యువల్ సర్వే మరియు ఫీల్డ్ లెవల్ తనిఖీల్లో భాగంగా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు శ్రీకాళహస్తి ఆర్.డి.ఓ బాను ప్రకాష్ రెడ్డి తో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా, రీసర్వే గ్రౌండ్ ట్రూథింగ్ పనుల పురోగతిని జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఫీల్డ్ వెరిఫికేషన్‌లో పాల్గొంటున్న అధికారులతో మాట్లాడి, సర్వే ప్రక్రియపై తగిన సూచనలు చేశారు.
​అలాగే, ఆయా గ్రామాల రైతులు, భూ యజమానులతో జాయింట్ కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడి రీసర్వే పై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సర్వే బృందాలకు రైతులందరూ పూర్తిగా సహకరిస్తూ, అవసరమైన చోట సరైన ఆధారాలు మరియు భూ రికార్డులను అందించి సర్వే ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలన్నారు.

ఈ కార్యక్రమంలో సర్వే శాఖ సహాయ సంచాలకులు (ఏ డి ), ఏర్పేడు మండల రెవెన్యూ అధికారి , జిల్లా తనిఖీ అధికారులు, మండల సర్వేయర్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మరియు ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *