తిరుపతి
ఎస్ వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ జి రవి ప్రభు ఆధ్వర్యంలో వైద్య అధ్యాపకులకు నిరంతర వైద్య విద్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం మూడు రోజులపాటు నిర్వహిస్తున్నామని తెలిపారు.*
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి.ఎం.సి. వెల్లూరు వారి సౌజన్యంతో (06) ఆరవ బి.సి.ఎం.ఇ. కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు.
*నేషనల్ మెడికల్ కౌన్సిల్ న్యూఢిల్లీ వారి ఆదేశాల మేరకు కో-ఆర్డినేటర్‌గా డా శ్రీహరి రావు నియమించారు.
వైద్య అధ్యాపకులు నిరంతరము వైద్య విద్యలో వచ్చే మార్పులను గమనించి తమ ప్రావీణ్యాలను పెంచుకోవాలన్నారు.*
అప్పుడే పేద రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించవచ్చునని అన్నారు.
వైద్య విద్య అభ్యసించే వైద్య విద్యార్థులకు ఉత్తమమైన వైద్య విద్యను అందించవచ్చునని తెలిపారు.*
రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా బి. మనోహర్ మాట్లాడుతూ వైద్య విద్యను అభ్యసించేటప్పుడు, కొత్త కొత్తగా వస్తున్న వైద్య రంగంలోని మార్పులను, ఎప్పటికప్పుడు వైద్య విద్యార్థులకు, మెలుకువలు తెలియపరచినట్లయితే రోగులకు మెరుగైన వైద్యం అందించవచ్చునని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిరంతర వైద్య విద్య నోడల్ అధికారి డా. ఏఎస్ కిరీటి, ప్రసూతి ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ ప్రమీల దేవి, డాక్టర్ సిరిగిరి సునీత, వైద్యులు, వైద్య అధ్యాపకులు, పీజీ వైద్య విద్యార్థులు, ఫ్యాకల్టీ, ఎం.ఇ.యు. తదుతరులు పాల్గొన్నారు.
