శ్రీ శ్రీ శ్రీ పర్వతాల గంగమ్మ గుడి నందు మొదటిసారి వినాయక విగ్రహం శ్రీ శ్రీ శ్రీ పర్వతాల గంగమ్మ గణపతి యూత్ ఖుషి బబ్లు ముఖ్య అతిధులను ఆహ్వానించిన శ్రీ శ్రీ శ్రీ పర్వతాల గంగమ్మ గుడి ఆలయ చైర్మన్ రవీంద్ర, ఆలయ కార్యదర్శి కృష్ణమూర్తి, ట్రెజరర్ లక్ష్మమ్మ, ఆలయ సలహాదారి రామ తులసి,
వీరు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
కాణిపాకం వినాయక బాబు (మధు), సుబ్రమణ్యం ఆచారి, కోటి,నాగరాజు గ్రామస్తులు పాల్గొన్నారు.
వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
వినాయక చవితిని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా చిన్నారుల్లో ప్రతిభను ప్రోత్సహించేలా వివిధ పోటీలు నిర్వహించారు.
చిన్నారులు ఉత్సాహంగా పాల్గొనగా, విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. పోటీల సందర్భంగా చిన్నారుల సందడి, ఉత్సాహంతో కార్యక్రమ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
వినాయకుడి దర్శనానికి స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు అన్నదానం ఏర్పాటు చేశారు.
భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించి నిర్వాహకులను అభినందించారు.
వినాయక చవితి వేడుకల సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు చిన్నారుల కోసం నిర్వహించిన పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు, స్థానికులు సహకరించారు.
భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో దిలీప్, ఖుషి, బబ్లు, శ్రావణ్, మోక్షి, లక్కీ, గణి, దేవ, మిధున్, గ్రామస్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *