– 16 సంవత్సరాలుగా ఓంకార గణపతి యూత్ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు…

– సెప్టెంబర్ 20న నిమజ్జనం, లడ్డూ వేలం పాట.

రేణిగుంట
​రేణిగుంట పరిధిలోని పాంచాలి నగర్ 6వ వీధిలో ‘ఓంకార గణపతి యూత్’ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుండగా, ఈ ఏడాది కూడా వినాయక మండపాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో స్థాపించారు. ఈ వేడుకల సందర్భంగా నిర్వాహకులు ప్రతిరోజూ ప్రత్యేక సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 15న జగదాంబ అమ్మ టీమ్ మరియు హంస చికెన్ షాప్ సౌజన్యంతో, సెప్టెంబర్ 16న ఎమ్. శ్రీనివాసులు, సెప్టెంబర్ 17న సుబ్బమ్మ, సెప్టెంబర్ 18న పాండు సర్, అలాగే సెప్టెంబర్ 19న విక్రమ్‌సరి ఆధ్వర్యంలోని తపస్య స్కూల్ సహకారంతో విశేష అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనంతరం సెప్టెంబర్ 20న సాయంత్రం 3:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు స్వామివారి నిమజ్జన మహోత్సవం జరగనుంది. నిమజ్జనం సమయంలో లడ్డూ వేలం పాటతో పాటు లక్కీ డ్రా విజేతల ప్రకటన, లడ్డూ మరియు వెండి నాణెం విజేతలను వెల్లడించనున్నారు. ఈ పోటీల కోసం 1 కేజీ లడ్డూ కూపన్ ధర ₹216/- గాను, 10 గ్రాముల వెండి నాణెం కూపన్ ధర ₹516/- గాను నిర్ణయించారు. ఈ ఉత్సవాల నిర్వహణలో యూత్ ప్రెసిడెంట్ ఎమ్. చరణ్ నేతృత్వంలో సభ్యులు మహేష్, యుగంధర్, చెన్నకేశవులు, హేమాద్రి, టి. చరణ్, భార్గవ్, హేమంత్, కార్తీక్, హరి, సాయి, సొల వెంకటేష్ సాయి, వెంకట రమణ, వంశీ, మధన్, అర్జున్, భాను, వినీత్, మహీధర్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *