రేణిగుంట జిఎం స్ట్రీట్ లో శ్రీ అభయ వినాయక అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సుమారు 31 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించి వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు వినాయక చవితి పర్వదినాన తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. మట్టి గణపయ్యను పట్టణవాసులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. రెండవ రోజు మంగళవారం మధ్యాహ్నం చెంజి రాధ వారి కుమార్తె చెంజి నాగ తేజస్వీ వారి సహకారం తో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషిత రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీ అభయ వినాయక అసోసియేషన్ కమిటీ సభ్యులు లక్ష్మణ్, సుమన్, కళ్యాణ్, జూలియన్ రాజు లు ఆమెను శాలువాతో సత్కరించి తీర్థ, ప్రసాదాలు అందించారు. ఆమె వెంట టిడిపి పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ
మట్టి వినాయకుడిని పూజిద్దాం….
పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే లక్ష్యంతో 31 అడుగుల మట్టి ను ప్రతిష్టించామని అన్నారు.
ఏడు రోజులపాటు వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందుకు సహకరిస్తున్న పట్టణ పెద్దలకు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏడు రోజులు పాటు ప్రతి రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 19వ తేదీ శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సన్ రైజ్ మల్టి సూపర్ స్పెషల్ హాస్పిటల్ రేణిగుంట వారి సహకారం తో ఉచిత మెడికల్ క్యాంపు, సాయంత్రం 6 గంటలకు నుంచి చిన్నారుల తో సాంసృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. చివరి రోజు ఆదివారం 108 చెంబులతో పాలాభిషేకం, మధ్యాహ్నం 3000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం. సాయంత్రం 6 గంటలకు అక్కడే స్వామివారి నిమజ్జనం చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో అసోసియేషన్ కమిటీ సభ్యులు సుబ్బు, హేమాద్రి, పవన్, గజ, మురళి, దినేష్, ప్రభు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *