రేణిగుంట మండలం
జై భీమ్ సేన రాష్ట్ర కన్వీనర్‌గా పాస్టర్ నవీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జై భీమ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు పవర్ రామచంద్ర అధ్యక్షతన జరిగిన ముఖ్య సమావేశంలో ఈ ఎంపిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దళిత నాయకుడు, ‘దళిత సింహం’ తాళ్ళపాక దాము ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయ సాధన దిశగా సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు, ప్రజా సమస్యల పరిష్కారానికి జై భీమ్ సేన నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. పాస్టర్ నవీన్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా సంస్థ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం పాస్టర్ నవీన్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాస్టర్ నవీన్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించిన అధ్యక్షుడు పవర్ రామచంద్రకు, పెద్దలు తాళ్ళపాక దాముకు, ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అంబేడ్కరిజం స్ఫూర్తితో ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జై భీమ్ సేన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *