

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, పిట్లం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ వారి సౌజన్యంతో ఎస్సీ నిరుద్యోగ మహిళలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.మహిళా సాధికారత లక్ష్యంగా అన్ని రంగాల్లో మహిళలురాణించాలని ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగాఉంటూప్రోత్సహిస్తుందని అన్నారు.మహిళలు వంటింటికి పరిమితం కాకుండా,వారి కాళ్ల మీద వారు నిలబడేలా ఆర్థికంగానిలబెడుతూ,వ్యాపారరంగంలోనిలదొక్కుకునేలా,స్వయం సహాయక మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.ఆడబిడ్డలు చదువు మధ్యలోఆపేయకూడదని,ఉన్నత విద్యలు అభ్యసించాలని సూచించారు.మహిళల చదువుతోనేకుటుంబాలుబాగుపడుతాయనిచెప్పారు.అదేవిధంగా ప్రజా ప్రభుత్వం పేద బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని అన్నారు.అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
ఎస్సీ వర్గీకరణ,బీసీ కులగణన వంటి చారిత్రాత్మక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం లభించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి,పట్టుదల వల్లే ఇది సాధ్యమైందన్నారు.
ఇటువంటి చారిత్రాత్మక బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందిన సమయంలో తాను శాసన సభ్యుడిగా శాసన సభలో ఉండడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని
తనను ఎమ్మెల్యే గా గెలిపించిన జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,తదితరులు ఉన్నారు.
