మూడు ప్యాకెట్లు…ఆరు సీసాలు..

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం, కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యం వెరసి ఏలేశ్వరం మండలంలో సారా వ్యాపారం మూడు ప్యాకెట్లు, ఆరు సీసాలు చందాన కొనసాగుతోంది. కొన్ని గ్రామాల్లో సారా వ్యాపారం కుటీర పరిశ్రమగా తయారైందనే విమర్శలు బలంగా ఉన్నాయి. గతంలో మాదిరిగా సారా నియంత్రణకు ప్రస్తుత అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో వ్యాపారులు తమ వ్యాపారాన్ని మరింత రెట్టింపు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో సారా విక్రయాలపై అధికారులు దృష్టి సారించి దాని నిర్మూలనకు కృషి చేసేవారు. అలాగే ఏ ఒక్క ఫిర్యాదు అందినా వెంటనే స్పందించి సంబంధిత వ్యాపారులను గుర్తించి చర్యలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఏ మాత్రం కనిపించడం లేదు. ఫిర్యాదుదారుని వివరాలను సారా వ్యాపారులకు చేరవేసి వారిద్దరి మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారనే అపవాదు అధికారులపై ప్రస్తుతం ఉంది. దీనివల్ల లేనిపోని గొడవలు మనకెందుకులే అంటూ ఫిర్యాదు చేసేందుకు ప్రజలు అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో సారా తయారీ దారులు తమ వ్యాపారాన్ని జోరుగా విస్తరింపజేస్తున్నారు.చిన్న వ్యాపారుల పైనే కేసులు మండలంలో ఏయే గ్రామాలలో సారా తయారీతో పాటు, విక్రయాలు జరుపుతారో సంబంధిత అధికారుల్లో చాలామందికి తెలుసనే అభిప్రాయం స్థానికుల్లో ఉంది. అయినప్పటికీ వారెందుకనో పట్టించుకోరనే పుకార్లు ఉన్నాయి. ఒకోసారి ఉన్నతధికారుల ఒత్తిళ్ల వల్ల నామమాత్రపు కేసులు పెట్టడం ఇక్కడి అధికారులకు పరిపాటిగా మారింది. అప్పుడు కూడా బడా వ్యాపారుల జోలికి వెళ్లకుండా లీటరు, రెండు లీటర్ల అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులను కేసుల్లో ఇరికించి చేతులు దులుపుకుంటారంటూ ఎక్సైజ్‌ అధికారులపై ప్రజలు నుంచి విమర్శలు ఉన్నాయి.బెల్లం వ్యాపారులపై చర్యలు ఉండవా మండలంలో ఎక్సైజ్‌ అధికారుల వైఖరి చాలా వింతగా కనిపిస్తోంది. చీటికీ మాటికీ సారా విక్రయదారులపైనే ఎక్సైజ్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారే తప్ప సారా తయారీకి ప్రధాన కారణమైన బెల్లం వ్యాపారులపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు. బెల్లం వ్యాపారులపై నిఘా పెడితే మండలంలో సారా తయారీని చాలా వరకు అరికట్టవచ్చని స్థానికులు చెప్పుకొస్తున్నారు. గతంలో నల్ల బెల్లం రవాణాపై పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారుల నిఘా ఉండేది. ఆ బెల్లానే సారా తయారీకి వినియోగించడంతో గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం సాగేది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. నల్ల బెల్లం రవాణాకు అడుగడుగునా ఆటంకాలు ఎక్కువవ్వడంతో తెల్ల బెల్లానే(గృహ అవసరాలకు వాడే బెల్లం)సారా తయారీకి ఉపయోగించేస్తున్నారు. పైగా నల్ల బెల్లం కంటే తెల్ల బెల్లం తక్కువ ధరకు లభించడం, ఆపై తెల్ల బెల్లం రవాణాకు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో అటు సారా వ్యాపారులకు, ఇటు బెల్లం వ్యాపారులకు కలిసొస్తుంది. గతంలో నల్ల బెల్లాన్ని తరలించడానికి వ్యాపారులు నానా పాట్లు పడాల్సి వచ్చేది. రాత్రి, అర్ధరాత్రి వేళల్లో నల్ల బెల్లాన్ని సారా తయారీ స్థావరాల వద్దకు తరలించేవారు. దీంతో సారా తయారీ కూడా తక్కువుగా జరిగేది. కానీ తెల్ల బెల్లాన్ని సారా తయారీకి వినియోగించడం మొదలు పెట్టినప్పటి నుంచి మండలంలోని చాలా గ్రామాల్లో సారా తయారీ కుటీర పరిశ్రమగా మారింది. నిబంధనలు ఉల్లఘించి మరీ తెల్ల బెల్లం వ్యాపారాన్ని ఏలేశ్వరం లో వ్యాపారులు విస్తరింపజేశారు. నిత్యం మండల పరిసర ప్రాంతాలతో పాటు, ఏజెన్సీలోని పలు ప్రాంతాలకు ఏలేశ్వరం నుండి యర్రవరం నుంచి తెల్ల బెల్లం వేల కిలోల కొలదీ తరలివెళ్తుంది.ఎక్సైజ్‌ అధికారులు మాత్రం పట్టించుకోరు. అసలు అంత బెల్లం ఎందుకు తరలిస్తున్నారు. ఆ బెల్లం అంతటికీ లెక్కలు ఉన్నాయా. అవేమి అధికారులకు పట్టవు. కానీ వాస్తవాన్ని తెలుసుకుంటే ఆ బెల్లం ఎక్కడికి వెళ్తుందో, ఎందుకు అంత మొత్తంలో బెల్లాన్ని వినియోగిస్తున్నారో అధికారులకు తెలుసు. ముఖ్యంగా మండలంలో ఎర్రవరం ఏలేశ్వరం నుంచి అధిక మొత్తంలో తెల్ల బెల్లం ఇతర ప్రాంతాలకు రవాణా జరుగుతోంది. ఆ రెండు గ్రామాలకు యర్రవరం, ఇతర ప్రాంతాల నుంచి బెల్లం దిగుమతి అవుతుంది. యర్రవరం లోనే అనేక మంది ఈ బెల్లం వ్యాపారాన్ని నమ్మి జీవనం సాగిస్తున్నారంటే ఆ బెల్లానికి ఉన్న గిరాకీ, విలువ ఏపాటిదో ఈ పాటికే అర్థమై ఉంటుంది.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..