

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ యజమాని తాళ్లూరి గొల్లాజి,రాధ దంపతుల ప్రధమ కుమారుడు తాళ్లూరి కామేశ్వరరావు కరోనా సమయంలో అస్వస్థకు గురై మృతి చెందడం జరిగింది.బుధవారం నాడు కామేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా స్థానిక దయానంద సరస్వతి అనాధ శరణాలయంలో విద్యార్థులకు గొల్లాజి దంపతులు భోజనాలు ఏర్పాటు చేసి,శరణాలయ ఆవరణలో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షులు డాక్టర్ విజయబాబు మరియు సంఘ సభ్యులతో కలిసి పచ్చదనం పెంపొందించాలని సదుద్దేశంతో గొల్లాజి మొక్కలను నాటారు.అనంతరం ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేషెంట్లు త్రాగుటకు కూలింగ్ వాటర్ ప్లాంట్ ను హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ శైలజ సమక్షంలో గొల్లాజి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఊర కృష్ణమూర్తి,వరుపుల చిట్టిబాబు, వాగు రాజేష్,గ్రంధి శ్రీను,గోళ్ళ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.