

మనన్యూస్,మంచాల:ఎంఎన్ఆర్ యువ సేన సభ్యులు ఇటీకాల గోవర్ధన్ రెడ్డి తన సొంత గ్రామమైన రంగాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు తన జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్,అవసరమైన సామాగ్రిని అందజేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి ఇష్టంతో చదివి కన్న తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, చదువుకున్న పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు. చదువుతూ ఏదైనా సాధించగలమని, చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
