

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని మద్దూరు మండలానికి చెందిన 17 సంవత్సరాల ఒక మైనర్ బాలికను నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం బళ్ళు నాయక్ తండాకు చెందిన ధనవాత్ పవన్ కుమార్ కు 14 రోజుల రిమాండ్ విధించి సబ్ జైలుకు తరలించడం జరిగిందని విచారణ అధికారి ఏ సైదులు ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంస్టాగ్రామ్ యాప్ లో అమ్మాయిని పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో మోసగించి ఆమెను బలాత్కారం చేసినాడు అని బాధితురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. విచారణ చేపట్టి పరరిలో ఉన్న నిందితుడిని పట్టుకొని కోస్గి మండల న్యాయస్థానం నందు ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు.
