

Mana News :- చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నారు. జిల్లాలో గుర్తించిన ప్రాంతాల్లో షెడ్యూల్ మేరకు బుధవారం నుంచి 22వ తేదీ వరకు, ఆ తర్వాత 25 నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక క్యాంప్లను నిర్వహించనున్నారు. జిల్లాలోని సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఈ ప్రత్యేక ఆధార్ శిబిరాలను నిర్వహించనున్నారు.
