

మనన్యూస్,పిఠాపురం:ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) పీడీ చైత్ర వర్షిణి మంగళవారం పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు మరియు పీ.ఆర్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు.తొలుత ఆమె కుమారపురం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, మినీ గోకులం, కల్వర్టు పనులను, ఫక్రుద్దీన్ పాలెంలోని ఉపాధి కూలీలు చేస్తున్న పనులను, హార్టికల్చర్,బండ్ ప్లాంటేషన్,ట్యాంక్ డిసిల్టింగ్ పనులు , కంపోస్ట్ పీట్ తదితర పనులను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీడీ చైత్ర వర్షిణి..ఉపాధి హామీ పథకం కూలీలతో ముచ్చటించారు. అనంతరం ఆమె తాటిపర్తి గ్రామంలో జరుగుతున్న బి టీ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించారు, అలాగే చెందుర్తి, వన్నెపూడి గ్రామాల్లో నిర్మాణంలో వున్న ఫార్మ్ పోండ్ పనులని పరిశీలించారు ఈ పరిశీలనలో పీడీ వెంట ఏపీడీ పి.వశంతమాధవి,ఏపీవో లు, టెక్నికల్ అసిస్టెంట్లు, వివిధ గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు..
