

నెల్లూరు,మన న్యూస్, మార్చి16: – నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం కన్నుల పండగ రథోత్సవం సాగింది. స్వామి వారిని పట్టు వస్త్రాలతో అలంకరించి,రధం మీద ఉంచి ముందుగా గాలి గోపురం తూర్పు వైపున రైల్వే గేట్ వరకు తర్వాత దక్షిణం వైపు నాలుగు కాలం మండపం వరకు రథోత్సవం సాగింది.ఈ రథోత్సవం తిలకించడానికి వేలాది మంది ప్రజలు,భక్తులు తండోపతండాలుగా విచ్చేశారు. రంగనాథ స్వామి గుడి నుండి నాలుగు కాళ్ల మండపం వరకు రోడ్డుకి ఇరువైపులా తీర్థ ప్రసాదాలు భక్తులకు ఇచ్చారు.ఈ రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు వారు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
