యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోరీ..

Mana News :- టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో ఆదివారం తెల్లవారు జామున భారీ దొంగతనం జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్‌ రోడ్డు నెంబర్‌- 8లోని ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు చేతికందిన సొత్తను తీసుకుని పరారయ్యాడు. తమ ఇంట్లో చోరీ జరిగినట్టు విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిలింనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దుండగుడి కోసం గాలింపు మొదలు పెట్టారు. కాగా విశ్వక్ సేన్ కుటుంబమంతా ఒకే ఇంట్లో ఉంటోంది. విశ్వక్ సేన్ సోదరి వన్మయి బెడ్ రూమ్ మూడో అంతస్తులో ఉంటుంది. అయితే ఆదివారం తెల్లవారుజామున వన్మయి గదిలో వస్తువులన్ని చిందరవందరగా పడి ఉన్నాయి. అనుమానం వచ్చిన ఆమె రూమ్ లోని ఆల్మారాలను పరిశీలించింది. అక్కడ ఉండాల్సిన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన వన్మయి ఈ విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్లింది. ఆయన వెంటనే ఫిలింనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. కరాటే రాజు ఫిర్యాదుతో పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. క్లూస్‌ టీం సహాయంతో ప్రాథమిక ఆధారాలు, వేలిముద్రలు సేకరించారు. అనంతరం ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. తెల్లవారుజామున 5. 50 నిమిషాల ప్రాంతంలో.. ఒక గుర్తుతెలియని వ్యక్తి బైక్‌ మీద వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి ఇంటి గేటు తీసుకుని డైరెక్టుగా మూడో అంతస్తుకు వెళ్లాడని, వెనుక డోర్‌ నుంచి విశ్వక్ సేన్ సోదరి వన్మయి బెడ్‌రూంలోకి వెళ్లి.. అల్మరాలో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇదంతా కేవలం 20 నిమిషాల్లోనే జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 6 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు