

మన న్యూస్ ప్రతినిథి
ఏలేశ్వరం: భారతీయ జనతా పార్టీ నూతన శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన సోము వీర్రాజుని రాజమండ్రి తన స్వగృహంలో కాకినాడ జిల్లా మాజీ అధ్యక్షులు చిలుకూరి రాంకుమార్,జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మడి వెంకట్రావు మండల నాయకులతో కలిసి సోము వీర్రాజుకి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువ మోర్చా అధ్యక్షులు పాపారావు, ప్రత్తిపాడు మండల అధ్యక్షులు ఊటా వీరబాబు,రౌతులపూడి మండల అధ్యక్షులు లవుడు శ్రీనివాసు, ప్రతిపాడు మండలం ప్రధాన కార్యదర్శి గోనగాని గంగా గోపాలస్వామి,రౌతులపూడి మండలం ప్రధాన కార్యదర్శి ఎనుముల రాజా, ప్రత్తిపాడు మండలం ఉపాధ్యక్షులు నానిపల్లి శ్రీనివాస్,బిజెపి సీనియర్ నాయకులు మాణిక్యం తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.