

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మండలంలోని సిరిపురం గ్రామంలో ప్రభుత్వాలు మారినప్పటికీ గ్రామ అభివృద్ధి శూన్యమని గ్రామ ప్రజలు వాపోతున్నారు.చెత్త నుండి సంపద ఉన్నప్పటికీ గ్రామంలో అధికారుల నిర్లక్ష్యమో లేక పారిశుద్ధ్య కార్మికుల నిర్లక్ష్యమో తెలియదు కానీ రోజుల తరబడి ఇళ్లకే పరిమితమైన చెత్త రోజులు గడుస్తున్న కొద్ది తీసుకెళ్లలేని పరిస్థితి.పారిశుధ్య కార్మికులు రావడంలేదని ప్రశ్నించగా మాకు జీతాలు సరిగా ఇవ్వడం లేదని పారిశుధ్య కార్మికులు వాపోతున్నారు.గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ,దోమలు మందు కొట్టే మిషన్ ఉన్నప్పటికీ పంచాయతీ అధికారులు కానీ నాయకులు కానీ వాటిని దుర్వినియోగ పరుస్తూ ప్రజల ఆరోగ్యంపైనిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని,అలాగే వేసవి తాపానికి తాగునీటికి సైతం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గ్రామంలో పనిచేసే బోర్లు కన్నా పనిచేయని బోర్లు ఎక్కువగా ఉన్నాయని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మండల అధికారులు స్పందించి సిరిపురం గ్రామం అభివృద్ధికి తోడ్పడుతారని గ్రామస్తులు కోరుతున్నారు.స్పందించన ఎడల ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు