

పెనుమూరు , మన న్యూస్ :-…….90 ఎం.ఎల్ బ్యాచ్ కు ఇకపై మీ ఆటలు సాగవని గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ హెచ్చరించారు.శనివారం పెనుమూరు మండలంలో గ్రీవెన్స్ సెల్ లో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు అలాగే ప్రజా సమస్యల పై అర్జీలు వెంటనే పరిష్కరిస్తామని ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ డాక్టర్ ఎమ్మెల్యే థామస్ మోనార్కుడు అని కొందరు పత్రికలో రాశారు.రేయ్ నేను అయ్యా అని సలాం కొట్టడానికి రాలేదు ప్రజల అభివృద్ధి కోసం వచ్చానని, అవును నేను మోనార్కుడు నే నా స్టైలే వేరు అని, నేను మంచి పని చేయడానికి వచ్చాను, నన్ను రెచ్చగొట్టావంటే వేరే అసభ్య పదజాలంతో మాట్లాడవలసి వస్తుంది నేను ఆర్డినరీ ఎమ్మెల్యే కాదు ప్రపంచ దేశాల తిరిగిన మేధావిని నేను, సుమారు నూరు దేశాలు తిరిగాను 70 వేల మంది పిల్లలను టెస్ట్ టు బేబీ ద్వారా పుట్టించాను, నేను నల్ల వాడిని చూశాను, ఎర్ర వాడిని చూశాను, పొట్టి వాడిని చూశాను, గట్టివాడిని చూశాను, మీ 90 ఎం.ఎల్ బ్యాచ్ ఎంత..? నేనెందుకు నీ దగ్గర చేయి కట్టుకొని కూర్చోవాలా..? అని అన్నారు.
