

మనన్యూస్,కామారెడ్డి:ఫైవ్ స్టార్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక మద్దికుంట గ్రామానికి చెందిన చిదుర విట్టల్ గుండెపోటుతో మృతి,కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామనికి చెందిన చిదుర విట్టల్ ఫైవ్ స్టార్ ఫైనాన్స్ బాధలు భరించలేక గుండెపోటు రావడంతో హైదరాబాదులో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందడం జరిగింది.ఈ సందర్భంగా విట్టల్ భార్య చిదుర నాగరాణి,తమ్ముడు చిదుర పాండు,గ్రామానికి చెందిన వడ్ల రత్న చారి,సాయవ్వ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ గత నాలుగు ఐదు రోజుల క్రితం ఫైవ్ స్టార్ ఫైనాన్స్ వాళ్ళు ఇంటికి వచ్చి,ఇంటికి కలర్ వేసి వేలం పాట వేస్తామని పక్కవారికి చెప్పడంతో ఇట్టి విషయన్ని చిదుర విట్టల్ కు చెప్పడంతో గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకెళ్లడం జరిగింది.నిన్న మధ్యాహ్నం మృతి చెందడం జరిగిందని,మృతి గల కారణం ఫైవ్ స్టార్ ఫైనాన్స్ అన్నారు.ఫైవ్ స్టార్ ఫైనాన్స్ బాధలు తట్టుకోలేక గుండెనొప్పి రావడం జరిగిందని,ఫైవ్ స్టార్ ఫైనాన్స్ వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఫైవ్ స్టార్ ఫైనాన్స్ వాళ్లు కనీసం ఇన్సూరెన్స్ కూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు,గత ఏడు సంవత్సరాల క్రితం స్టార్ ఫైనాన్స్ లో 7 లక్షల రూపాయలు తీసుకుంటే ఇంకా 9లక్షలు కట్టాలని అంటున్నారని,అతని కట్టాల్సింది మాత్రం రెండు లక్షలు మాత్రమే ఉంటాయని వడ్డీ చక్రవడ్డీ బారువడి అన్ని కలిపి వసూలు చేస్తున్నారని,ఒకవేళ కట్టకపోతే ఇంటిని వేలం పాట వేసి కట్టించుకుంటామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. అధికారులు ఫైవ్ స్టార్ ఫైనాన్స్ వారి పైన చర్యలు తీసుకొని మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
