

మనన్యూస్,కాకినాడ:మంత్రి, డిప్యూటీ సిఎం జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రజాహిత వెతలపై స్పందించాలని కోరుతూ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ఎనిమిది అంశాల ఫ్లెక్సీతో గాంధేయ మార్గంలో నిరసన చేపట్టారు. కాకినాడలో ఎనిమిది గ్రామాల విలీన సమస్యలు, జిల్లా కేంద్రానికి కార్పోరేషన్ ఎన్నికలు, ఆర్థిక సంఘం నిధులు, ముంపునకు గురవుతున్న కాకినాడ సామర్లకోట హైవే కెనాల్స్, ఉప్పుటేరు ప్రక్షాళన, అనారోగ్యకర కోనోకార్పస్ వృక్షాలు తొలగింపు, కాకినాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వికేంద్రీకరణ, ప్రసూతి విభాగంలో బెడ్స్ పెంపు, ఉప్పాడ తీరంలో రక్షణగోడ, మడ అడవుల పెంపకం సంరక్షణ, సాల్ట్ భూముల్లో విమానాశ్రయం, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాదికి అన్యాయం జరగకుండా ఎంపి సీట్ల పెంపు పర్యటనల్లో వ్యక్తిగతం కాని వినతిపత్రాల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాటు అంశాలను కోరారు.
నిజాయితీగా ప్రశ్నించే ప్రజాస్వామ్య గొంతుకలకు జవాబులు ప్రకటించాలన్నారు. జిల్లాకు ఏకైక మంత్రిగాను డిప్యూటీ సిఎంగా ప్రజాహిత వినతి పత్రాలు స్వయంగా స్వీకరించే ప్రక్రియకు పవన్ పర్యటనల్లో తగిన సమయం కేటాయించక పోవడం వలన అధికారుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి వలన ప్రజాస్వామిక వాదుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని రమణ రాజు పేర్కొన్నారు.
