స్వార్థ రాజకీయాల కోసం, ప్రజాస్వామ్య విలువల్ని కాలరాయొద్దు

వైసీపీ శ్రేణులకు హితవు పలికిన టిడిపి మహిళా నేత మమత

Mana News :- తిరుపతి, నవంబర్ 12,(మన న్యూస్ ) :- స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రజాస్వామ్య విలువల్ని కాలరాయొద్దని, నిబద్ధతతో పనిచేసే అధికారుల మనోభావాలను సోషల్ మీడియా వేదికగా…, దెబ్బతీయద్దంటూ వైసీపీ శ్రేణులకు హితవు పలికారు టిడిపి మహిళా నేత మమత. కూటమి ప్రభుత్వాన్ని ,పోలీస్ ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసిన కొందరి వైసిపి నేతల తీరును మంగళవారం తిరుపతిలో మమత ఖండించారు. శాంతి భద్రతలకు పెద్దపీట వేసే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.., క్రమశిక్షణ, నైతిక విలువలు కలిగిన అధికారులను ఎంపిక చేసుకుని ఉద్యోగ బాధ్యతలు అప్పగిస్తారని ఆమె తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని సీఎం చంద్రబాబు ఉపేక్షించరని మమత గుర్తు చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే ఏపీ సీఎం చంద్రబాబు.., ప్రజలకు సేవ చేసే నిబద్దత, చిత్తశుద్ధితో విధులను సక్రమంగా నిర్వర్తించే అధికారుల సేవలను సద్వినియోగం చేసుకుంటారన్న విషయాన్ని వైసిపి విస్మరించడం బాధాకరమన్నారు. ఆ కోవకు చెందిన వారే తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అని ఆమె అన్నారు. చట్టానికి లోబడి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న తిరుపతి జిల్లా ఎస్పీని లక్ష్యంగా చేసుకొని, వైసిపి మూకలు సోషల్ మీడియాలో ఇష్టారీతిన వ్యవహరించడం, వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ మోహన్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఉందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని నియంత్రించి, పనిచేసే ప్రభుత్వానికి సహకరించాలని మమత విజ్ఞప్తి చేశారు. అప్పుడే రాష్ట్ర ప్రజలు హర్షిస్తారని, అలా కాదని ముందుకెళితే భవిష్యత్తులో వైసీపీ మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు మమత.

  • స్వార్థ రాజకీయాల కోసం, ప్రజాస్వామ్య విలువల్ని కాలరాయొద్దు…
  • నిబద్ధత కలిగిన అధికారుల మనోభావాలను దెబ్బ తీయొద్దు..
  • హద్దులు మీరితే ప్రజల నుంచి గుణపాఠం తప్పదు…
  • వైసీపీ శ్రేణులకు హితవు పలికిన టిడిపి మహిళా నేత మమత

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!