

జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల
మనన్యూస్,గొల్లప్రోలు:సుదూర ప్రాంతాల నుండి 12 వ జనసేన పార్టీ ఆవిర్భావ సభ కు తరలి వచ్చె జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు వీర మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజనం ఏర్పాట్లు చేసినట్లు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 14 వ తేదీన పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చిత్రాడ వద్ద భారీ ఎత్తున ఆవిర్భావ దినోత్సవం జరుపు కొంటున్నట్లు తెలిపారు.ఈ సభకు ఉభయ రాష్ట్రాలకు చెందిన అభిమానులు కార్యకర్తలు నాయకులు తరలి వస్తారని తెలిపారు.అలా వచ్చే కార్యకర్తలు పిఠాపురం పాదగయ కుక్కుటేశ్వర దేవస్థానం దర్శనం చేసుకొని సభా ప్రాంగణానికి వచ్చే అవకాశం ఉన్నందున అన్న సదుపాయాలకు జనసైనికులు వీర మహిళలు ఇబ్బందులు పడకుండా వెజిటబుల్ బిర్యానీ అందించ నున్నట్లు జ్యోతుల శ్రీనివాస్ తెలిపారు.అలాగే వారి దాహార్తిని తీర్చడానికి చల్లని మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.స్వామి వారి ఆలయం పరిసర ప్రాంతాల్లో ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి లక్షలాది కార్యకర్తలు హాజరు కావడం జరుగుతుందని తెలిపారు.సభకు వచ్చే కార్యకర్తలు అభిమానులు నాయకులు ఈ సదుపాయాన్ని వినియోగించు కోవాలని శ్రీనివాస్ తెలిపారు
