

రాష్ట్రప్రభుత్వం స్థల పట్టా..కాంట్రాక్ట్ ఉద్యోగం.. విద్య వైద్యం బ్యాంకు రుణం.వితంతు ఫించన్ కల్పించాలి
పౌర సంక్షేమ సంఘం
మనన్యూస్,గొల్లప్రోలు,కాకినాడ:ట్రాన్స్ పోర్ట్ పార్శిల్ ఉల్లిపాయల బాంబుల ప్రేలుడు లో 50శాతం కాలిపోయి ఐ సి యు లో 10రోజులు నరక యాతన చెంది దుర్మరణం చెందిన కాకినాడ నూకాలమ్మ మాన్యం నివాసిగా వున్న కూలీ గజ్జిల మద్దిలేటి అంశం అత్యంత విచారకర మని పౌర సంక్షేమ సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పది రోజుల వ్యవధిలో మృతునికి ప్రమాదం ఐసియూ లో చికిత్స మరణం సంభవించడం అంత్యక్రియలు పూర్తయినప్పటికీ ప్రమాదానికి ప్రధాన హేతువుగా కారణమైన ట్రాన్స్ పోర్ట్ యాజమాన్యం మృతుని ముగ్గురు పిల్లలకు బ్యాంక్ డిపాజిట్ కల్పించక పోవడం దారుణంగా వుందన్నారు. మృతుని పిల్లలుగా వున్న మహేష్ మధుమోహన్ మమత ముగ్గురికీ రూ.10లక్షల వంతున రూ.30 లక్షలు డిపాజిట్ చేసి అనాధ లుగా మారిన అతని కుటుంబాన్ని ఆదుకోవా లని డిమాండ్ చేశారు. అధికార పలుకుబడితో బాధిత కుటుంబ పిల్లలకు ఇప్పటి వరకు ఆర్థిక సహాయంగా డిపాజిట్ చేయక పోవడం మంచి పరిణామం కాదన్నారు. సాక్షాత్తూ జిల్లా ఎస్ పి ప్రమాద స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి ప్రేలుడు వస్తువులు ట్రాన్స్ పోర్ట్ చేయడమే ప్రమాదానికి కారణంగా గుర్తించినందున శిక్షార్హమైన క్రిమినల్ కేసుల ద్వారా న్యాయస్థానం తీర్పు తప్పదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం మానవతా దృక్పథంతో స్పందించి బాధితుని భార్య చిన్నికి ప్రభుత్వ స్థల పట్టా కాంట్రాక్ట్ బేస్ పద్ధతిలో ఉపాధి ఉద్యోగం కుటుంబానికి ప్రభుత్వ పథకాల్లో విద్య వైద్యం బ్యాంకు రుణం వితంతు ఫించన్ మున్నగు వాటికి ప్రాధాన్యత ఇచ్చి మంజూరు కల్పించాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు జిల్లా కలెక్టర్ ను కోరారు. ఇటువంటి కేసును కోర్టులు సుమోటోగా స్వీకరించి కారకులను శిక్షించాల న్నారు. రహదారి మార్గంలో గాని గోడౌన్ లో గాని ఆయిల్ ట్యాంకర్ల వద్ద గాని స్పీడ్ బ్రేకర్స్ కుదుపులో ప్రేలుడు సంభవించి వుంటే వూహించని పరిణామాలు ఏర్పడే దన్నారు. ట్రాన్స్ పోర్ట్ లో ప్రేలుడు వస్తువులు సరఫరా లేకుండా నియంత్రణ చేసేందుకు కఠిన చర్యలు కొనసాగించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలని ఇందుకు తగిన తీరుగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. లేకుంటే ఇటువంటి దుస్సంఘటనలకు కారణం అవుతాయన్నారు.
(ఫోటో) గజ్జిల మద్దిలేటి మృతుని చెంత అతని భార్య
