

మనన్యూస్,కామారెడ్డి:పాల్వంచ మండలం గురువారం ఉదయం బండరామేశ్వర్ పల్లి వాగు నుండి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ ఐ అనిల్ తెలిపారు అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతాయని మండల ప్రజలు గమనించి పోలీస్ లను సహకరించాలని అన్నారు
