

నెల్లూరు,మన న్యూస్,మార్చి 12:- నెల్లూరు జిల్లా యువత పోరు సక్సెస్. *పోటెత్తిన వైస్సార్సీపీ కార్యకర్తలు.
*నెల్లూరు సిటీ నుంచి బారీగా హాజరు.**వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, యువత.*ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ వైఎస్ఆర్సిపి క్యాడర్ తో కలిసి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ.*వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సాగిన యువత పోరు కార్యక్రమం యువత, విద్యార్థులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో విజయవంతంగా సాగింది. నెల్లూరుజిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి , వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తో పాటు నియోజకవర్గాల సమన్వయకర్తలు, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి బుధవారం ఉదయం నెల్లూరు, వి ఆర్ సి సెంటర్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి అర్పించిన అనంతరం సుమారు, 5 వేల మంది విద్యార్థులు, యువతతో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.ప్రభుత్వం తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలన్న విద్యార్థులు, యువత నినాదాలతో ర్యాలీ హోరెత్తింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాలీకి.. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.ర్యాలీ కలెక్టరేట్ కు చేరుకున్న అనంతరం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా అటు విద్యార్థులను, ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి, చేపట్టకుండా ఇటు యువతను కూటమి ప్రభుత్వం మభ్యపెడుతుందని దుయ్యబట్టారు.కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చక పోవడంతో ప్రజాగ్రహానికి గురైందని వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇవాళ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో వారు చదువులకు దూరం అవుతున్నారని మండిపడ్డారు. అటు ఉద్యోగ కల్పన ఏమైనా సాగుతుందా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కూడా చంద్రబాబు ప్రభుత్వం మొండి చేయ్యి చూపిందని ఇది ఒక దుర్మార్గపు పాలనగా అభివర్ణించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…………ప్రతి పేద విద్యార్ది ఉన్నత విద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకువచ్చారని తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తూ విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టారని అన్నారు. చంద్రబాబు గవర్నమెంట్ లో పెండింగ్ లో పెట్టిన 2 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్లియర్ చేయడం జరిగిందన్నారు.అయితే నేడు కూటమి సర్కార్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.ఇప్పటివరకు విద్యార్థులకు సంబంధించి ఆరు క్వార్టర్స్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని ఇలా అయితే విద్యార్థుల చదువులు ఎలా సాగుతాయని ప్రభుత్వాన్ని నిలదీశారు.ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్న కారణంగా కొన్ని చోట్ల కళాశాల వారు విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదన్నారు.ఈ పరిస్థితుల్లో పేదవాడు ఉన్నత విద్యను ఏ విధంగా అభ్యసించ గలడని.. దీనికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.అంతేకాకుండా నిరుద్యోగులకు ఇస్తామన్న 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి హామీ.. కేవలం ప్రకటనకే పరిమితమైంది అన్నారు. అధికారంలోకి వస్తే 25 వేల పోస్టుల తో మెగా డీఎస్సీ ఇస్తామన్న చంద్రబాబు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేవలం 16 వేల పోస్టులతో డీఎస్సీ ని ప్రకటించి..10 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల చేయకుండా జాప్యం చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటుంన్నారని మండిపడ్డారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల మంది వాలంటీర్ల జీవితాలు రోడ్డున పడ్డాయిన్నారు.కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాకపోవడంతో వారంతా అభద్రతా భావనలో ఉన్నారన్నారు.మా నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ప్రజలకు చేస్తున్న అన్యాయాలపై గట్టి పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా లోని ఇతర నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ గారికి విద్యార్థులు యువత ఎదుర్కొంటున్న సమస్యలపై మెమోరాండం అందజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ నియోజకవర్గాల సమన్వయకర్తలు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి , ఆనం విజయ్ కుమార్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య ,బుర్ర మధుసూదన్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి , మెరిగ మురళిధర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, వైసిపి నాయకులు కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
