

మనన్యూస్,నారాయణ పేట:రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో లైన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా వారి ఆధ్వర్యంలో అయ్యప్ప డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆధ్యాత్మికం సేవ దృక్పథం కలిగి ఉండాలని ఉద్దేశంతో ఫస్ట్ ఎయిడ్స్ సిఆర్పి పై అవగాహన కల్పించారు.రెడ్ క్రాస్ మెంబర్ బాబుల్ రెడ్డి మాట్లాడుతూ,విద్యార్థులు సమాజం పట్ల సేవా దృక్పథం కలిగి ఉండాలని అన్నారు.ప్రమాదవశాత్తు ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా రక్షించాలో ప్రత్యక్షంగా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కలిగించారు. అదేవిధంగా 15వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు నేరడగం జాతర సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఈ నాలుగు రోజుల పాటు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమంలో పాల్గొనాలని విద్యార్థిని విద్యార్థులకు డిగ్రీ కళాశాల డైరెక్టర్ అనంత్ సూచించారు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా అధ్యక్షులు డి.వి.చారి రెడ్ క్రాస్ మహబూబ్నగర్ మేనేజర్ నరసింహ లైన్స్ క్లబ్ క్లబ్ కోశాధికారి కే.అంజన్ ప్రసాద్, ఉపన్యాసకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
