

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ త్వరగా కోలుకోవాలని ఏలేశ్వరం మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు యర్రవరంలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు.గ్రామ టీడీపీ నాయకులు బస్సా ప్రసాద్, మైరాల కనకారావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి, మాజి జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు నగర పంచాయతీ నాయకులు బొదిరెడ్డి గోపి హాజరయ్యారు. ముందుగా ప్రసన్నాంజనేయ స్వామికి కొబ్బరికాయలు కొట్టి తమ నేత ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అరక రాజు, బుద్ధ సూర్య ప్రకాష్, దనేకుల భద్రరావు,జిగటాపు సూరిబాబు, పలివెల శ్రీను, పలివేల వెంకటేశ్వరరావు, తోట వెంకటేశ్వరరావు, నూకతోటి ఈశ్వరుడు, పలువురు ఎన్డీఏ కూటమి నేతలు హాజరయ్యారు.