

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సంఘటనపై జనసేన పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది.ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోగికి వైద్యం నిమిత్తం వరుపుల తమ్మయ్యబాబు డాక్టర్లతో దురుసుగా ప్రవర్తించాడనే కారణంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలుసుకున్న డాక్టర్ శ్వేత లింగంపర్తి వరుపుల తమ్మయ్యబాబును వారి నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిశారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆరోజు ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనలో తమ్మయ్య బాబు వలన నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని,నా మనోభావాలు దెబ్బతినలేదని డాక్టర్ శ్వేత, వారి కుటుంబ సభ్యులు మీడియా ముఖంగా తెలిపారు.