

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,మహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చొరవతో గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద 5 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో గ్రామంలో సిసి రోడ్డు పనులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ప్రారంభించారు. గ్రామంలో సిసి రోడ్డు పనులను ప్రారంభించేందుకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంలు,నాయకులు సాయగౌడ్,భూమ్ రెడ్డి, కాశిరాం,ఇస్మాయిల్ తదితరులున్నారు.