అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి – మంత్రి నాదెండ్ల మనోహర్ కు గౌరీ నాయుడు వినతి పత్రం

పిఠాపురం మార్చి 10 మన న్యూస్:- పిఠాపురం పట్టణానికి చెందిన యువ సాహితీవేత్త, రచయిత, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిగ్రీ అతిథి అధ్యాపక సంఘం రాష్ట్ర నాయకుడు డాక్టర్ కిలారి గౌరీ నాయుడు కాకినాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యను బోధిస్తూ విద్యారంగ అభివృద్ధికి విశేష సేవలను అందిస్తున్న అతిథి అధ్యాపకుల సమస్యలపై డాక్టర్ గౌరీ నాయుడు మంత్రితో చర్చించారు. ఒక కళాశాలలో పర్మినెంట్ అధ్యాపకుల బదిలీలు జరిగినప్పుడు అతిధి అధ్యాపకులను పోస్టు ఖాళీగా ఉన్న డిగ్రీ కళాశాలకు పంపించేలాగ విద్యాశాఖ జీవో జారీ చేసేలాగ కూటమి ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నెలవారి ఇచ్చే జీతం గంటల చొప్పున కాకుండా సంవత్సరంలో 12 నెలలు కన్సాలిడేటెడ్ జీతం ప్రభుత్వం ఇచ్చేలాగ ప్రభుత్వం తరపున సహకారాన్ని అందించాలని విన్నవించారు. గత సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిగ్రీ అతిథి అధ్యాపకుల సంఘం నాయకులు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్. ఎన్.వర్మ, పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ సమక్షంలో కలిసినప్పుడు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న అతిథి అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని మంత్రి మనోహర్ హామీ ఇచ్చారని గౌరీ నాయుడు తెలిపారు. జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదల పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ తరపున సహకారాన్ని అందిస్తానని మంత్రి మనోహర్ హామీ ఇవ్వటం పట్ల గౌరీ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే పడాల అరుణ, రాష్ట్ర తూర్పు కాపు కార్పోరేషన్ ఛైర్మన్ పాలవలస యశస్వినీ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ), శాసనమండలి విప్ పిడుగు హరిప్రసాద్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఆంధ్రప్రదేశ్ అతిథి అధ్యాపకుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

పహల్గాం ఉగ్రదాడికి గాను సింగరాయకొండ సెల్స్ షాప్ అసోసియేషన్ సంఘీభావం

మన న్యూస్ సింగరాయకొండ:- జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన భయానక ఉగ్రవాద దాడికి గాను దేశం మొత్తం విషాదంలో మునిగిపోయిన వేళ, నేడు సింగరాయకొండ సెల్స్ షాప్ అసోసియేషన్ తమ సంఘీభావాన్ని చాటుతూ తమ షాపులను స్వచ్ఛందంగా మూసివేసి…

సింగరాయకొండ మండల వైసీపీ అధ్యక్షుడిగా మసనం వెంకట్రావు

మన న్యూస్ సింగరాయకొండ:- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, కొండేపి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 6 మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులను కేంద్ర కార్యాలయం నియమించింది.సింగరాయకొండ మండలానికి మసనం వెంకట్రావు అధ్యక్షుడిగా నియమించారు. పార్టీకి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పహల్గాం ఉగ్రదాడికి గాను సింగరాయకొండ సెల్స్ షాప్ అసోసియేషన్ సంఘీభావం

  • By JALAIAH
  • April 26, 2025
  • 2 views
పహల్గాం ఉగ్రదాడికి గాను సింగరాయకొండ సెల్స్ షాప్ అసోసియేషన్ సంఘీభావం

సింగరాయకొండ మండల వైసీపీ అధ్యక్షుడిగా మసనం వెంకట్రావు

  • By JALAIAH
  • April 26, 2025
  • 4 views
సింగరాయకొండ మండల వైసీపీ అధ్యక్షుడిగా మసనం వెంకట్రావు

స్మార్ట్ జన్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా ASCEND 2025 సెలెబ్రేషన్స్

  • By JALAIAH
  • April 26, 2025
  • 4 views
స్మార్ట్ జన్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా ASCEND 2025 సెలెబ్రేషన్స్

ఉగ్ర దాడిలో అసువులు బాసిన వారికి నివాళి

  • By JALAIAH
  • April 26, 2025
  • 2 views
ఉగ్ర దాడిలో అసువులు బాసిన వారికి నివాళి

ప్రజల సమస్యల పరిష్కారానికి సమగ్ర ఉద్యమం ప్రారంభం—విజయజ్యోతి.

ప్రజల సమస్యల పరిష్కారానికి సమగ్ర ఉద్యమం ప్రారంభం—విజయజ్యోతి.

మౌలాలి సేవలు అభినందనీయం— పేర్ల జనార్దన్ రావు

మౌలాలి సేవలు అభినందనీయం— పేర్ల జనార్దన్ రావు