

నెల్లూరు, మన న్యూస్, మార్చి10 :- నెల్లూరు, కె.వి.ఆర్ పెట్రోల్ బంక్ వద్దగల శాంతి అపార్ట్మెంట్ లో సాయినాథ్ అండ్ కో అధినేత, పెద్దలు పత్తి రవీంద్రబాబు స్వర్గస్తులైనారు.ఈ సందర్బంగా పత్తి రవీంద్రబాబు పార్థివ దేహానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తో కలిసి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డినివాళులర్పించారు.వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భగవంతుడు ప్రార్థించారు.రవీంద్ర బాబు కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు.
