కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ 8 వార్షికోత్సవ వేడుకలు

మనన్యూస్,నెల్లూరు:కొన్నేళ్ల కిందట గ్రామాల్లో ఎటువంటి మెరుగైన సౌకర్యాలు లేవు.ఆ సమయంలో వీరు గ్రామాల్లో వైద్య సేవలు అందించారు.టిడిపి ప్రభుత్వంలో ఇచ్చిన జీవోను వైసీపీ ప్రభుత్వం విస్మరించింది.గ్రామీణ వైద్య సేవకులు గా గుర్తింపు ఇవ్వాలని వీరు కోరుతున్నారు.వీరి గుర్తింపు కోసం వీరినే ప్రణాళిక సిద్ధం చేయమన్నాం.నెల్లూరు నగరంలోని అభిరామ్ హోటల్ నందు ఆదివారం కమ్యూనిటీ పారామెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి 8 వ వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ నెల్లూరు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు.ఖాజామియ్యా సభా అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ.కొన్నేళ్ల కిందట గ్రామాల్లో ఎటువంటి మెరుగైన కార్యాలు లేని సమయంలో వీరు గ్రామాల్లో వైద్య సేవలు అందించారని తెలిపారు.2017 లో గ్రామీణ వైద్య సేవకులు గా ఒక ప్రణాళికబద్ధంగా గుర్తింపు ఇవ్వాలన్న ఆలోచనతో టిడిపి ప్రభుత్వం జీవోను విడుదల చేసిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే గుర్తింపు ఇస్తానని చెప్పి మాట తప్పి టిడిపి ప్రభుత్వం ఇచ్చిన జీవోను విస్మరించిందని అన్నారు.గ్రామీణ వైద్య సేవకులుగా గుర్తింపు ఇవ్వాలని వీరు కోరుతున్నారని తెలిపారు.వీరు చేస్తున్న సేవలకు గుర్తింపు ఇవ్వాలన్నా చట్టబద్ధత తేవాలన్నా ఒక ప్రణాళిక అవసరమని అన్నారు.ఏ ప్రతిపాదికన వీళ్ళకి గుర్తింపు ఇవ్వాలో వీరినే ప్రణాళిక రూపొందించమని అడిగామని అన్నారు.తద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి వీరికి గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తామని అన్నారు.కార్యక్రమంలో డా.సిరాజ్,భాను కిరణ్,చాన్ బాషా,ఖాజా మొహిద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..