

Mana News :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ మహిళ కార్య దర్శిగా జీడి నెల్లూరు నియోజక వర్గం, పెనుమూరు మండలానికి చెందిన రాష్ట్ర మాజీ హౌసింగ్ డైరెక్టర్ ద్రాక్షాయణి నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం శనివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ పోరాడుతానని, అదే విధంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
