మహిళలు మహారాణులు

కాణిపాకం మార్చ్ 8 మన న్యూస్

ఐరాల మండల కేంద్రంలోని కాణిపాకం యూ.ఎస్ కళ్యాణమండపం నందు మనం ఫౌండేషన్ హైదరాబాదు వారి సహకారంతో శ్రీదేవి కళావేదిక ఐరాల మండలం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మనం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చక్రవర్తి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని, మహిళ గనుక లేకపోతే మానవజాతి లేదని, అటువంటి మహిళ ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా, అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నారని, అటువంటి మాతృమూర్తిని స్మరించుకొనే దినమే మహిళా దినోత్సవం అని కొనియాడారు. గత కొన్ని సంవత్సరాలుగా అన్ని రాష్ట్రాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు మనం ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నామని అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి కాణిపాకంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం శ్రీదేవి కళావేదిక అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ మహిళలు అని రంగాల్లో ముందున్నారని, ఒక బలమైన స్త్రీ తనకోసమే కాకుండా ఇతరుల కోసం కూడా నిలబడి పోరాడుతుందని, స్త్రీలే సమాజానికి నిజమైన వాస్తు శిల్పులు, అని ఇంటి నుండి ఆఫీసుల వరకు మహిళలు దేనినైనా మహిళలు అందంగా నిర్మించగలరని, అలాంటి మహిళలకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు కలదని అలాంటి మన ఫౌండేషన్ సహకారంతో, శ్రీదేవి కళావేదిక ఐరాల మండలం తరఫున సత్కరించడం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజ సేవకు అంకితమై సంస్థ పనిచేస్తుందని కొనియాడారు. అనంతరం సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించి, మరియు వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన మహిళలను, అధిక సంఖ్యలో గుర్తించి ఘనంగా సన్మానించి మనం ఫౌండేషన్, శ్రీదేవి కళావేదిక సంస్థ తరఫున పురస్కారాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన సంస్కృతి కళా సంస్థ అధ్యక్షులు సహదేవ నాయుడు, ప్రధాన కార్యదర్శి కలకట రెడ్డప్ప,‌ ప్రముఖ రచయిత్రి ఎం.ఆర్ అరుణ కుమారి, ప్రముఖులు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 1 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు