

మనన్యూస్,కామారెడ్డి:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఏఎస్పీ,జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ సూచనలతో సబ్ డివిజన్ల వారీగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న మహిళా అధికారులు మరియు సిబ్బందిని అధికారులు ఘనంగా సన్మానించారు.కామారెడ్డి సబ్ డివిజన్లో పోలీస్ శాఖలో పనిచేస్తున్న మహిళ పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని ఏఎస్పీ చైతన్య రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు.జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు మరియు పోలీస్ కార్యాలయాల్లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
