

మన న్యూస్,తిరుపతి,మార్చి 8:– ఈనెల 14వ తేదీన పీఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం తిరుపతి నియోజవర్గ సన్నాహక సమావేశంలో ఛలో పిఠాపురం పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి జనసైనికులు, వీరమహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. బహిరంగ సభ విజయవంతంపై తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ జనసేన ఇన్చార్జీలతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. పదకొండు ఏళ్ళ జనసేన ప్రస్థానంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని ఇటీవలి సాధారణ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి రికార్డు నెలకొల్పడంలో పార్టీ చీఫ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పమే కారణమని ఆయన తెలిపారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ నుంచి జనసైనికులకు పవన్ కళ్యాణ్ దశదిశ నిర్థేశించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, కార్పోరేటర్లు సికే రేవతి, నారాయణ, నరసింహాచ్చారి,ఎస్ కే బాబు, పొన్నాల చంద్ర, నరేంద్ర, దూది శివ, ఆదం సుధాకర్ రెడ్డి, యాదవకృష్ణ, వెంకటేశ్వర రావు, హరిశంకర్, బాబ్జి, పగడాల మురళీ, జానకిరామ్, ఆకేపాటి సుభాషిణి, కీర్తన, ఆకుల వనజ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
