

నిజాంసాగర్,( జుక్కల్ ) నవంబర్ 12,మత్స్యకారులు అభివృద్ధికి పెద్దపీట వస్తుందని కాంగ్రెస్ పార్టీ మహ్మద్ నగర్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు.మంగళవారం తుంకపల్లి గ్రామ శివారులో చెరువులో ప్రభుత్వం రాయితీపై చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
మత్స్య కారులకోసం చేపల వేట కొనసాగిస్తూ జీవనోపాధి పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాగభూషణం గౌడ్,ఖలీల్, కృష్ణ, అంజయ్య,గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.