

మనన్యూస్,నారాయణ పేట:అంతర్జాతీయ మహిళా దినోత్సవము సందర్భంగా మక్తల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మహిళామణులను ఘనంగా సత్కరించారు.మార్కెట్ చైర్ పర్సన్ గవినోళ్ల రాధా లక్ష్మారెడ్డి తోపాటు సిబ్బంది కట్టా అంజమ్మ, కావలి పార్వతమ్మ లను శాలువా,పూలమాలలతో సత్కరించారు. ఈసందర్భంగా మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్ మాట్లాడుతూ,సృష్టికి మూల కారణం మహిళ అని, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. మహిళల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి గణేష్ కుమార్ , సెక్రటరీ చంద్రశేఖర్ , డైరెక్టర్లు ఎమ్ శ్రీనివాసులు ,విష్ణువర్ధన్ రెడ్డి , ఎండీ ఫయాజ్ , రంజిత్ రెడ్డి , మహేష్ , సిబ్బంది పాల్గొన్నారు.
