

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిదిలోని కృష్ణ మండలం గుడేబల్లూరు గ్రామంలో మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి గారి సహకారంతో లయన్స్ రామ్ రెడ్డి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో కంటి శస్త్ర చికిత్స చేసుకున్న వారికి వాకిటి శ్రీహరి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాలను అందజేశారు.ఇటీవల ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించగా దాదాపు 120మందికి సమస్యలు గుర్తించి, మహబూబ్ నగర్ లోని కందూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు పూర్తి చేశారు. తిరిగి గుడేబల్లూరు చేరుకున్న వారికి శనివారం రోజు ఉచిత కంటి అద్దాలు, మందులు, పండ్లు,బ్రెడ్లు ఉచితంగా అందజేశారు. కంటి శస్త్ర చికిత్సలు చేసుకున్న వారు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపారు.భవిష్యత్తులో సైతం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్న శ్రీహరి అన్న సేవా సమితి కి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజప్ప గౌడ, ఏ. రవికుమార్, నూరుద్దీన్ , అసముద్దీన్, బోయ నరసింహ , కృష్ణమూర్తి , నారాయణ, వెంకటేష్ రామ్ రెడ్డి లయన్స్ ఆసుపత్రి సిబ్బంది సత్యం గౌడ్, ఖాజాద్దీన్ గూడబల్లూరు గ్రామ నాయకులు పాల్గొన్నారు.
