

మనన్యూస్,నెల్లూరు:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తో కలిసి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీపర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ ను ఘనంగా సత్కరించారు.అనంతరం ఆయా రంగాల్లో రానిస్తున్న మహిళలను సత్కరించి.వారికి నేతలు అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళల పాత్ర ఎనలేనిదని కొనియాడారు.నేడు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రానిస్తుండడం అభినందనీయమని తెలిపారు.ఒకప్పుడు మహిళ ఏ రంగంలో రాణించాలన్న పురుషుడు పాత్ర కొంత అవసరం ఉండేదని నేడు అలా కాకుండా మహిళలే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ విజయాలను సొంతం చేసుకుంటూ తమకు తిరుగు లేదని చాటుకుంటున్నారని తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల ఆకాంక్షలకు అనుగుణంగా వారి నిర్ణయాలను గౌరవిస్తూ మహిళలను ప్రగతి పథంలో నిలిపే పార్టీ అని అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా అందుకు అనుగుణంగా మహిళలకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్న తక్షణమే పరిష్కరించాలన్న దృక్పథం కలవారని తెలిపారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అనేక పథకాలు తీసుకువచ్చారన్నారు,అందులో భాగంగా ఆసరా,చేయూత,కాపు నేస్తం వంటి పథకాలతో మహిళలు ఆర్థికంగా పురోగతి సాధించేందుకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు.రాబోయే రోజుల్లో కూడా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని మహిళా పక్షపాతి ప్రభుత్వాన్ని సాదించుకోవాలని పిలుపునిచ్చారు.
