

మనన్యూస్,గొల్లప్రోలు:శంఖవరం పిర్ల సూర్య నారాయణ మరణం నెల్లిపూడి గ్రామానికి తీరని లోటని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ పేర్కొన్నారు.శనివారం శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామంలో పిర్ల కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ మాట్లాడుతూ పిర్ల సూర్య నారాయణ తీవ్ర ఆవేదనకు గురి చేసిందని తెలిపారు.కత్తిపూడి కర్షక పరిషత్ చైర్మన్ గా ప్రజలకు ఆయన అనేక సేవలందించి నట్లు తెలిపారు.అలాగే గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో తలపంటి నాగేశ్వరరావు,తలపంటి వీరబాబు పిర్ల నూకరాజు,జ్యోతుల సీతారాం బాబు సఖినాల లచ్చబాబు పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
